నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే మళ్లీ వింటేజ్ రోహిత్ శర్మ గుర్తుకొచ్చాడు. తనకే సాధ్యమైన పుల్ షాట్స్ తో బంతిని స్టాండ్స్ లోకి తరలిస్తుంటే గూస్ బంప్స్ వింటేజ్ షో అసలు. 163 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు ఓపెనింగ్ కి వచ్చిన రోహిత్ శర్మ 16 బంతులు ఆడి 3 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. ఆడటానికి టైమ్ తీసుకున్నాడు కానీ ఆ సిక్సులు కొట్టిన విధానం మాత్రం పాత రోహిత్ శర్మను గుర్తు చేసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడిన రోహిత్ కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. నిన్న కొట్టిన 26 పరుగులే హయ్యెస్ట్ ఈ సీజన్ లో. పైగా ఈ సీజన్ ను డకౌట్ తో ప్రారంభించి..అంచెలంచెలుగా స్కోరు మ్యాచ్ మ్యాచ్ కు పెంచుతూ నిన్నటితో 26 వరకూ తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. పైగా నిన్న రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి వాంఖడేలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెడుతున్నారు. రెండోది ఐపీఎల్ ప్రారంభమై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా రోహిత్ శర్మకు మ్యాచ్ కు ముందు చిన్న మొమెంటో సన్మానం చేశారు. చిన్నప్పటి నుంచి తను ఆడుకుంటూ పెరిగిన గ్రౌండ్ లో ఓ స్టాండ్ కి తన పేరే పెడతారన్న జోష్ లో ఉన్నాడేమో కొట్టిన మూడు సిక్సులు కూడా స్టాండ్స్ లోకే పంపి తన హ్యాపీనెస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. నిన్న కొట్టి సిక్సుతో వాంఖడేలోనే 100 సిక్సులు పూర్తి చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మ్యాచ్ అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మకు సిక్సులు కొట్టడంలో టిప్స్ ఇస్తూ కనిపించాడు. అదీ రోహిత్ శర్మ అంటున్నారు ఫ్యాన్స్.